Our Team

Our Facilitators

1. చుక్క కిరణ్ కుమార్(SGT) 8184854708,  chukkakiran8@gmail.com

2.కదిరె రమేష్ (SGT) 9948640074 dumala.ram@gmail.com

3. మెుడుసు బాలకృష్ణ(SGT) 9441701239   balu5794@gmail.com

4. మొగిలి ఎల్లయ్య (SGT) 9948763482

 " నేను నా పిల్లలకు బోధించను, పిల్లలు నేర్చుకునే అభ్యసన వాతావరణం కల్పిస్తాను " అన్నట్టు గా మేము Facilitators అని తెల్పుతూ.... స్వేఛ్ఛా వాతావరణం లో 
సృజనాత్మక ఆలోచనలు రేకెత్తిస్తూ, స్వతహాగ నేర్చుకునే కృత్యాలు కల్పిస్తూ, ప్రత్యేక శ్రద్ద వహిస్తూ నాణ్యమైన విద్య అందిస్తూ, మంచి మానవ వనరులను భావి తరానికి 
అందించాలని ఆశిస్తూ . . . . . . . . . . . . . . . .

 

మా సందేశం: విద్యా అధికారులకు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ మిత్రులకు మరియు తల్లిదండ్రులకు మా నమస్కారాలు.

మేము చేసింది మీకు చూపడానికి ఈ సైటు ని చెయ్యలేదు. మా అనుభవాలు మీతో పంచుకుంటూ, ఇంకా ముందుకు ఏవిధంగా వెళ్ళాలో తెలుసుకునేందుకు మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

నేడు మారిన విద్యావిధానాల వల్లనో, ఆంగ్ల మాధ్యమం మీద మోజు వల్లనో, ఉపాద్యాయుల పనితీరు వల్లనో లేదా తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవడం వల్లనో ఇలా రకరకాల కారణాల వలన మన ప్రభుత్వ బడులు మూతపడే దశకు చేరుకున్నాయి.దీనికి కారణాలు ఏవైనా మనం మన పనితీరు కారణం కాకూడదనేదె మా ఉద్దేశ్యం. ఇలా బక్కచిక్కిపోతున్న మన బడులకు మనమే బలం అవుదాం.

మనం సమయపాలన పాటిద్దాం.పాఠశాలలో ఉన్న సమయం పిల్లలతోనే గడపడం, వెనుకబడిన విద్యార్థి మెరుగుకు కృషి చేయడం, తరచుగా తల్లిదండ్రులతో పిల్లల గురించి, పాఠశాల పరిస్థితి గురించి మాట్లాడుతుండడం చెయ్యాలి. ఇలా చెయ్యడంవలన ఈ దశను అధిగమించగల్గుతామని ఆశిస్తూ . . . .మీ బాకురుపల్లి ఉపాధ్యాయ మిత్రబృందం . . . .

Items: 1 - 1 of 1