ఈ మా బాకురుపల్లి ప్రాథమిక  పాఠశాల 02-08-1997 లో ప్రారంభమయ్యింది.ప్రతి సంవత్సరం పిల్లలతో నిండుగా ఉండే ఈ పాఠశాలలో ఎప్పుడూ ఉపాద్యాయుల లోటు వేదిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో దగ్గరలో గల గ్రామం రాచర్లబోప్పాపూర్ లో గల ప్రభుత్వేతర బడుల వైపు ఆకర్షితులవుతున్న తరుణంలో గ్రామస్తులంతా కలిసి విరాళాల రూపంలో చెల్లిస్తూ ప్రత్యేకంగా ఉపాధ్యాయులని నియమించుకుని నడిపించడం జరిగింది. . . . . .

          ఈ తరుణంలో డిప్యుటేషను పై వచ్చిన సతీష్ అనే ప్రభుత్వ ఉపాద్యాయుడు వచ్చి నమ్మకం కలిగించి సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ప్రజలతో చర్చిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో 2010 సంవత్సరంలో కదిరె.రమేశ్, లెంకల.జయకృష్ణ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు రావడం జరిగింది. వీరుకూడ అదే స్పూర్తిని కోనసాగిస్తూ పిల్లల క్రమశిక్షణ ప్రగతి పట్ల శ్రద్ద వహిస్తూ సమావేశాలలో చర్చిస్తూ చక్కగా పాఠశాల నడుస్తున్న తరుణంలో . . . . . .

ఇంతలో తల్లిదండ్రులకు తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవాలని ఆంగ్ల మాధ్యమానికి ఆకర్షితులవుతూ ప్రైవేటు పాఠశాలలకి పంపించడం జరిగింది. ఈ దశలో పాఠశాల Strength 36 కు పడిపోయింది. ఈ దశలో మెుడుసు.బాలకృష్ణ, చుక్క.కిరణ్ కుమార్ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు 2013 May  లో ఈ పాఠశాలకి రావడం జరిగింది.వీరు వచ్చిన వెంటనే ఉత్సాహంతో June 1 నుండి ఇంటింటా తిరిగాం అందరికి నమ్మకం కలిగేలా కష్టపడతామని హామీ యిస్తూ గ్రామంలోని పిల్లలందరిని మన పాఠశాలకే  పంపిచాలని తెలియజేశాం. ప్రభుత్వపాఠశాల విద్య , MDM, FREE DRESSES, FREE TEXTBOOKS . . . ఇలా ప్రభుత్వపాఠశాలల్లో గల సౌకర్యాల గురించి కూలంకషంగా వివరించి గ్రామస్తులందరితో సమావేశం ఏర్పాటు చేశాం. సమావేశంలో గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చిఅందరి పిల్లలను మన పాఠశాల లోనికే పంపించాలని తీర్మానించారు. ఆవసరమైన వనరులు సమకూర్చుకోవాలని దాని కోసం విరాళాలు సేకరించి  నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇట్టి నిధిని మన ప్రాంత విద్య అభివృధ్ధి కోసం పాఠశాల అవసరాలకె వినియోగించాలని తీర్మానించారు. యీ బడిని బ్రతికించుకోవాలని అందరు ఏకత్రాటి పైకి రావడం జరిగింది.

ఇదే తరుణంలో పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ఈ దశలో కదిరె.రమేశ్, మెుడుసు.బాలకృష్ణ, చుక్క.కిరణ్ కుమార్ లు మేము సైతం అంటూ తమ వంతుగా స్వంత ఖర్చులతో పిల్లలకు వారంలో ఓక రోజు పాలు అందిస్తున్నారు. ఆంగ్ల పుస్తకాలు బోధన చేస్తూ, LAPTOP ఆధారిత బోధన చేస్తూ తల్లిదండ్రులకు నమ్మకం కల్గిస్తూ జవాబుదారి తనంతో వ్యవహరిస్తూ సాగిపోతున్న ఈ తరుణం . . . . . .లో

తల్లిదండ్రుల సహకారం మరియు ఉపాధ్యాయుల పనితీరు వెరసి మంచి పాఠశాల దిశగా అడుగులేస్తూ . . . . . .

    మీ బాకురుపల్లి ఉపాధ్యాయ మిత్రబృందం . . . . . . .  

వీక్షకులారా

మా ఈ  website చూసి, దీని గురించి ఇతరులకి తెలుపుతూ మాకు ఉత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తూ . . . . .