C C E

21/12/2013 12:03

Continuous Comprehensive Evaluation ---------  నిరంతర సమగ్ర మూల్యాంకనం

నాడు:  గతంలో విద్యా విధానం ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది, పిల్లల మనసు ఏమి రాయని నల్లబల్ల వంటిదని ఉపాధ్యాయులు తమకి నచ్చిన విషయాలని పిల్లల పై రుద్దేవారు.దీని మూలంగా చాలా మంది పిల్లలు విద్య నేర్చుకోవటంలో ఎన్నో ఇబ్బందులకి గురయ్యి అసలు విద్య అంటే భారంగా భావించి విద్యకి దూరమయ్యారు.

నేడు:   మన విద్యా విధానం పూర్తిగా మారిపోయింది.RTE 2009 ప్రకారం మన ప్రభుత్వం నూతన విధానం (CCE) రూపోందించి ప్రవేశపెట్టడం నిజంగా పిల్లలకి స్వేఛ్ఛా, స్వాతంత్ర్యం వచ్చినట్టే. ఎందుకంటే “వికాసం ” స్వయంగా ఆవిర్భవించేది.అలాంటి వికాసానికి అవసరమైన అనుకూలమైన వాతావరణం మాత్రమే మనం సృంష్టించాలి. పిల్లల పై మన జ్ఞానాన్ని రుద్దకూడదనేది మా అభిప్రాయం.

అసలు CCE అంటే :   పరీక్షలు కాదు, పిల్లలకు గ్రేడులు కాదు. ఇది  “ ప్రక్రియ, విధానం  ” అది పిల్లలు సమగ్రంగా అభివృధ్ధి చెందడానికి, పిల్లలు ఎలా నేర్చుకుంటారు,ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోంటున్నారో గుర్తించి  ఉపాధ్యాయులు తాము ఏమి చేయాలో దిశానిర్దేశం చేస్తుంది.

పిల్లలకి నిజంగా CCE అనేది వరంలాంటిది. పిల్లాడి కేంద్రీకృత బోధన తో ఉపాధ్యాయులు కూడ అంతగా ఓత్తిడి లేకుండ సులభతరంగా బోధన చేయవచ్చు.

పిల్లలు చిన్నప్పుడు వారికి వారే స్వయంగా నడవడానికి ప్రయత్నిస్తారు, కాని తల్లిదండ్రులు బలవంతంగా లేపి నడిపించరు కదా.కాని వారికి నడవడానికి అవసరమయ్యే మంచి పరిస్థితులని కలిపిస్తారు, ఉత్సాహాన్ని కలిగిస్తారు, ప్రోత్సాహాన్ని అందిస్తారు, అవసరమైతె సాధనాలు ఉపయోగిస్తారు. అప్పుడు పిల్లలు స్వేఛ్ఛగా కేరింతలు వేస్తూ నడుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం కదా.

CCE అంటే కూడ అలాంటి విధానమే. పిల్లలకి వారి స్వయం అభిప్రాయాలని , ప్రశ్నించే తత్వాన్ని , ఎదురయ్యే ఇబ్బందులని, స్వతహాగ చేసేపనులని ఉపాధ్యాయుడే సౌకర్యకర్తగా వ్యవహరించి వరి సర్వతోముఖాభివృధ్ధికి దోహదపడాలి.

పిల్లల మనసు అన్ని రాయబడిన కళ్శకు కనబడని నల్లబల్ల వంటిది. కాబట్టి మనం ప్రతి సామర్ధ్యాన్ని వెలికితీసే సౌకర్యకర్తగా ఉండాలే తప్ప ఇష్ఠంవచ్చిన విషయాలను రుద్దకూడదు.

CCE అనేది మన విద్యావిధానంలో విప్లవాత్మకమైన ప్రక్రియ.

. . . . . . . . చివరగా  మేము చెప్పేది ఏమిటంటే అదికారుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల నమ్మకం తో , ఉపాధ్యాయులు జవాబుదారి తనంతో మెలగి పిల్లలు స్వేఛ్ఛగా సమగ్ర అభివృధ్ధి సాధించాలని ఆశిస్తూ . . . . . . .

    Officers + Teachers + parents = Good school

  (ప్రోత్సాహం)+(జవాబుదారి తనం)+(నమ్మకం) = (మంచిపాఠశాల )

ఇవన్ని ఉపాధ్యాయ లోకానికి తెలసిన విషయాలే అయినప్పటికిని, మా సైట్ లో మా అభిప్రాయాలు మేము తెలియజేస్తూ రాసుకున్న చిన్ని ప్రయత్నం sir. . . . . .

మీ అభిప్రాయాలు, సలహాలు , సూచనలు  Guest Book అనే option లో తెలుపగలరు. . . . . . . .మేము వాటిని సవినయం గా స్వీకరిస్తామని తెలుపుతూ . . . . . .

                                                                               మీ బాకురుపల్లి ఉపాధ్యాయ మిత్రబృందం . . . . . . . .